- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో LPG కృత్రిమ కొరత.. హోటళ్లు, రెస్టారెంట్లకు CCPA వార్నింగ్
హోటళ్లు, రెస్టారెంట్లు తమ బిల్లులలో LPG ఛార్జీలు, గ్యాస్ సర్‌చార్జ్వ వసూలు చేయడం చట్టవిరుద్ధమని CCPA హెచ్చరించింది.

దిశ, వెబ్‌డెస్క్: హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే వినియోగదారులకు కేంద్ర వినియోగదారుల రక్షణ అధికార సంస్థ (CCPA) గుడ్ న్యూస్ చెప్పింది. ఫుడ్ బిల్లులపై అదనంగా LPG ఛార్జీలు, గ్యాస్ సర్‌చార్జ్ పేరుతో వసూలు చేయడంపై రెస్టారెంట్ యాజమాన్యాలను సీసీపీఏ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి అదనపు వసూళ్లు అనుచిత వ్యాపార ధోరణి' (Unfair Trade Practice) కిందకు వస్తాయని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు తమ వంట గ్యాస్ లేదా నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకునే ఆహార పదార్థాల ధరలను మెనూలో నిర్ణయించాలని, బిల్లులో విడిగా గ్యాస్ ఛార్జీలు వేయకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.
సర్వీస్ ఛార్జ్ స్థానంలో జిమ్మిక్కులు..
అయితే, గతంలో సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకూడదని ఇచ్చిన ఆదేశాలను తప్పించుకోవడానికి, కొన్ని రెస్టారెంట్లు ఇప్పుడు LPG ఛార్జ్ అనే కొత్త పేరుతో వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నాయని సీసీపీఏ గుర్తించింది. దీంతో మెనూ కార్డులో పేర్కొన్న ధర, వర్తించే పన్నులు (GST) మినహా మరే ఇతర ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అదనపు ఛార్జీలు వసూలు చేసే హోటళ్లపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్ 1915 కు ఫోన్ చేసి లేదా ‘E-Daakhil’ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, ఆ భారాన్ని నేరుగా సర్‌చార్జీల రూపంలో వినియోగదారులపై వేయడం చట్టవిరుద్ధమని సీసీపీఏ తేల్చి చెప్పింది.






