యోగా గురువు రాందేవ్ బాబాపై అరెస్టు వారెంట్.. ఎందుకంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-02 08:07:11  IST  )

యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా (Ramdev Baba), ఎండీ ఆచార్య బాలకృష్ణకు (MD Balkrishna) కేరళ హైకోర్టుకు షాక్ ఇచ్చింది.

యోగా గురువు రాందేవ్ బాబాపై అరెస్టు వారెంట్.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబాకు (Ramdev Baba) కేరళలోని ఓ కోర్టు షాక్ ఇచ్చింది. రాందేవ్ బాబా సహా, పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై (MD Balkrishna) నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. పతంజలికి (Patanjali) సంస్థకు చెందిన దివ్య ఫార్మసీ (Divya Pharmacy) వైద్య విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా పాలక్కాడ్ కోర్టు బాబా రాందేవ్‌కు, ఆచార్య బాలకృష్ణకు విచారణకు హాజరుకావాల్సిందిగా గతంలో నోటీసులు పంపించింది. ఈ నెల 1న విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.

అయితే, శనివారం జరిగిన విచారణకు వారిద్దరూ హాజరుకాలేదు. దీంతో కోర్టు ధిక్కరణ చర్యల కింద రాందేవ్ బాబాకు బాలకృష్టకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఇక తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. అయితే, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనల నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి (Patanjali) చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రభుత్వం వేటు వేసింది. ఆ ఉత్పత్తులకు సంబంధించి తయారీ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. కాగా, దీనిపై పతంజలి సంస్థ సీఈవో, రాందేవ్ బాబా ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story