- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Arrest: విరుదునగర్ పేలుడు కేసు.. పరారీలో ఉన్న ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
విరుదునగర్ బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 25 మంది ప్రాణాలు బలిగొన్న ఘటనలో పరారీలో ఉన్న ఫ్యాక్టరీ యజమాని ఈశ్వరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu)లోని విరుదునగర్ బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన ప్రధాన నిందితురాలు, ఫ్యాక్టరీ యజమాని ఈశ్వరి (Ishwar)ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 19న జరిగిన ఈ పేలుడు ఘటనలో మొత్తం 25 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పేలుడు జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న ఈశ్వరి కోసం విరుదునగర్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితురాలు కోయంబత్తూరులో తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం, అక్కడ మెరుపు దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని విరుదునగర్ ఎస్పీ ఎన్. శ్రీనాథ (SP N. Srinath) అధికారికంగా ధృవీకరించారు. నిందితురాలు ఈశ్వరి గతంలో పంచాయతీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.
ఏప్రిల్ 19న అసలేం జరిగింది..?
విరుదునగర్ జిల్లాలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలను నిల్వ చేయడం, అజాగ్రత్తగా పనులు నిర్వహించడం వల్ల ఏప్రిల్ 19న భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా నేలమట్టం కాగా, అక్కడ పనిచేస్తున్న 25 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించింది. నిందితురాలు ఈశ్వరిపై నిర్లక్ష్యం వల్ల మరణాలకు కారణం కావడం (Culpable Homicide) సహా పలు కఠినమైన ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.






