- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Arrest: ముడుపుల కేసు.. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ అరెస్ట్
భువనేశ్వర్‌లో సంచలనం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భువనేశ్వర్‌లో సంచలనం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు గురువారం రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసును పరిష్కరించేందుకు సంబంధించిన రూ.50 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఒక మైన్ ఆపరేటర్, రఘువంశీ డిమాండ్ చేసిన లంచం అడిగిన విషయాన్ని సీబీఐకి సమాచారం అందించగా.. పక్కా ప్లాన్ వేసి అతడిని అదపులోకి తీసున్నారు. ఒకటిన్నర సంవత్సరాలుగా భువనేశ్వర్ జోనల్ ఆఫీస్‌లో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రఘువంశీని ఇవాళ ఉదయం అధికారులు అరెస్ట్ చేసి భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. పూర్తి ఎంక్వైరీ తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.






