Daredevils: ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ ప్రపంచ రికార్డు

by Shamantha N |
Daredevils: ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ ప్రపంచ రికార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్మీకి (Indian Army) చెందిన ‘డేర్‌ డెవిల్స్‌’ (Daredevils) ప్రపంచ రికార్డు సృష్టించింది. మూవింగ్ మోటార్‌ బైక్‌లపై హ్యూమన్‌ పిరమిడ్‌తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో డేర్‌డెవిల్స్‌ రికార్డు సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్‌లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్‌ వాహనాలపై నిలబడి కర్తవ్యపథ్‌లోని విజయ్‌చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు. వీరిలో సిగ్నల్స్ కార్ప్స్ ఆర్మ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కె.వి.కుమార్ కూడా ఉన్నారు. "డేర్ డెవిల్స్" అని పిలువబడే మోటార్ సైకిల్ రైడర్ డిస్ ప్లే టీం, ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ నుండి వచ్చింది. ఈ బృందం సుదీర్ఘ చరిత్ర ఉంది. వీటిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా 33 ప్రపంచ రికార్డులు సాధించింది. 1935లో డేర్ డెవిల్స్ ప్రారంభమైంది. ఈ టీం రిపబ్లిక్ డే పరేడ్‌లు, ఆర్మీ డే పరేడ్‌లు సహా భారతదేశం అంతటా 1,600 కంటే ఎక్కువ మోటార్‌సైకిల్ ప్రదర్శనలను నిర్వహించింది. ఈ బృందం ఆర్మీ అంకితభావం, అసాధారణ నైపుణ్యం, సైన్యం పరాక్రమాన్ని సూచించేలా అసాధారణ ప్రదర్శనలు ఇస్తున్నాయి.

Advertisement

Next Story