- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్పుల విరమణ గడువు ముగిసిందా?.. తుదిగడువు లేదంటూ ఆర్మీ స్పష్టత
కాల్పుల విరమణ గడువు ముగిసిందని జరుగుతున్న ప్రచారంపై ఆర్మీ స్పందించింది. ఈ ఒప్పందానికి తుదిగడువు లేదని స్పష్టతనిచ్చింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం మే 18 వరకే అమలవుతుందని, ఆ తర్వాత ఈ ఒప్పందం గడువు ముగుస్తుందని జరుగుతున్న ప్రచారంపై భారత ఆర్మీ స్పందించింది. భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తుది గడువేమీ లేదని ఆర్మీ స్పష్టం చేసింది. మే 12 (సోమవారం) జరిగిన డీజీఎంవో స్థాయి చర్చల్లో కాల్పుల విరమణను కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు ఆర్మీ తెలిపింది.
ఈ ఒప్పందం ఆదివారంతో ముగుస్తుందని, మళ్లీ డీజీఎంవోల చర్చల తర్వాతే కాల్పుల విరమణపై నిర్ణయం ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఆర్మీ ఈ స్పష్టతనిచ్చింది. అలాగే ఆదివారం నాడు డీజీఎంవోల స్థాయి సమావేశం జరగలేదని, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని తెలిపింది.
Next Story






