- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Army: సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం.. ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
19 రోజుల తర్వాత మొదటి సారిగా జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులూ జరగలేదని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: 19 రోజుల తర్వాత మొదటి సారిగా జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులూ జరగలేదని ఇండియన్ ఆర్మీ (Indian Army) తెలిపింది. ఆదివారం రాత్రి ప్రశాంత వాతావరణంలో గడిచిందని తెలిపింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలు వంటి ఘటనలు ఏమీ జరగలేదని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ పాకిస్థాన్ (India Pakisthan) ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి మధ్య నియంత్రణ రేఖ (LOC), అంతర్జాతీయ సరిహద్దు (International barder) వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల్లో శాంతి నెలకొందని తెలిపింది. ఈ టైంలో ఎటువంటి కాల్పుల ఘటనలు జరగలేదని, 19 రోజుల్లో మొదటి సారి శాంతియుత వాతావరణం నెలకొందని వెల్లడించింది.
‘చాలా రోజుల తర్వాత తొలి సారిగా, జమ్మూ ప్రాంతంలోని స్థానికులు, పూంచ్ (Poonch) , రాజౌరి (Rajoury) వంటి తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో విమానాలు, క్షిపణి దాడులు, డ్రోన్ కార్యకలాపాల శబ్దాలు లేకుండా ప్రశాంతమైన రాత్రిని ఆస్వాదించారు. ఇది ఎంతో ఉపశమనాన్ని అందించింది. నివాసితులు తమ సాధారణ దినచర్యలకు తిరిగి రావడానికి వీలు కల్పించింది’ అని పేర్కొంది. కాల్పుల విరమణ తర్వాత పూర్తి స్థాయి శాంతిని చూశామని స్పష్టం చేసింది. కాగా, భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్ఓసీ వద్ద పాక్ గత కొన్ని రోజులుగా కాల్పులకు పాల్పడింది. దీంతో స్థానికులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మే 7 నుంచి 11 వరకు తీవ్ర స్థాయిలో షెల్లింగ్ జరిగింది. అయితే కాల్పు విరమణ అనంతరం ఎటువంటి ఘటనలూ చోటు చేసుకోకపోవడం గమనార్హం.






