Viral: నాకే అడ్డు చెప్తారా? విమాన సిబ్బందిపై ఆర్మీ ఆఫీసర్ దాడి

by Prasad Jukanti |   (  Updated:2025-08-13 15:40:59  IST  )

విమాన సిబ్బందిపై ఆర్మీ ఆఫీసర్ విచక్షణ రహితంగా దాడికి దిగాడు.

Viral: నాకే అడ్డు చెప్తారా? విమాన సిబ్బందిపై ఆర్మీ ఆఫీసర్ దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీ (Indian Army) అంటే క్రమశిక్షణకు మారుపేరు. అందులో పనిచేసే సోల్జర్స్ సైతం అంతే నిబద్దతతో ఉంటారు. కానీ అటువంటి ఆర్మీలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఆఫీసర్ రెచ్చిపోయాడు. తనను అడ్డుకున్నారన్న కారణంతో స్పైస్ జెట్ (Spice Jet) విమాన సిబ్బందిపై తీవ్రంగా దాడి చేసి వీరంగం సృష్టించాడు. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్మీలో పని చేస్తున్న ఓ అధికారి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. తన వెంట విమానంలో అదనపు క్యాబిన్ లగేజీ తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. అందుకు విమానసిబ్బంది నిరాకరించారు. తనను అడ్డుకోవడం పట్ల రెచ్చిపోయిన సదరు అదికారి అక్కడ ఉన్న నలుగురు స్పైస్ జెట్ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈఘనటలో విమానసిబ్బందికి తీవ్రంగా గాయాలు అయ్యాయని సిబ్బంది వెన్నుముక కూడా విరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు తేసుకున్న అధికారులు సదరు ఆర్మీ అధికారిని అరెస్టు చేశారు.

Next Story