రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఆర్మీ డాక్టర్..

by velandi.Saikiran |

ఉత్తరప్రదేశ్‌లోని విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో శనివారం ఒక అనూహ్య సంఘటన జరిగింది. రెండు నిండు

రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఆర్మీ డాక్టర్..
X

రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఆర్మీ డాక్టర్..

రైల్వే స్టేషన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు స్పాట్లోనే విజయవంతంగా డెలివరీ..

రైల్వే ఉద్యోగుల సహాయంతో ఆర్మీ మేజర్ చేసిన పనికి వెల్లువలా అభినందనలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో శనివారం ఒక అనూహ్య సంఘటన జరిగింది. రెండు నిండు ప్రాణాలను కాపాడారు ఓ ఆర్మీ డాక్టర్. ఒక గర్భిణీ స్త్రీ ప్లాట్‌ఫామ్‌పై ప్రసవ వేదనకు గురవడంతో అక్కడ ఉన్న వారంతా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే దేవుడులా దిగివచ్చాడు ఆర్మీలో మేజర్ గా పని చేస్తున్న డాక్టర్ రోహిత్ బచ్వలా. రైల్వే మహిళా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టూ కవర్ చేస్తుండగా 31 ఏళ్ల మేజర్ రోహిత్ బచ్వాలా... ఆ మహిళకు అక్కడే డెలివరీ చేశాడు.

ఆ మహిళ తన భర్త, బిడ్డతో పన్వేల్ నుండి బారాబంకికి పన్వేల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 15066లో ప్రయాణించడానికి స్టేషన్ కు చేరుకున్నారు. అప్పుడే పురిటి నొప్పులు మొదలయ్యాయి. దింతో ఆమె భర్త వైద్య సహాయం కోసం రైల్వే ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేశాడు. కానీ అదే సమయానికి హైదరాబాద్ వెళ్లడానికి ప్లాట్ఫామ్ వద్ద వేచి ఉన్న మేజర్ రోహిత్ వెను వెంటనే స్పందించారు. దింతో ఆ రెండు నిండు ప్రాణాలు నిలబడ్డాయి.

Next Story