జైపూర్‌లో ఘనంగా 78వ సైనిక దినోత్సవం

by Ajay Maddhiboyina |

జైపూర్ లో ఘ‌నంగా 78వ సైనిక దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వహించారు. ప‌రేడ్ లో ఆయుధ వ్య‌వ‌స్థ‌లు, సాయుధ వాహ‌నాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

జైపూర్‌లో ఘనంగా 78వ సైనిక దినోత్సవం
X

దిశ‌, వెబ్ డెస్క్: జైపూర్ లో ఘ‌నంగా 78వ సైనిక దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వహించారు. ప‌రేడ్ లో ఆయుధ వ్య‌వ‌స్థ‌లు, సాయుధ వాహ‌నాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. పాకిస్థాన్ తో జ‌రిగిన యుద్ధంలో వాడిన‌ బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని సైతం ప‌రేడ్ లో ప్ర‌ద‌ర్శించారు. దీంతో పాటు పినాకా రాకెట్ సిస్టమ్స్, కొత్త‌వ భైర‌వ ద‌ళం లాంటివి ప్ర‌ద‌ర్శించారు. ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది ప‌రేడ్ లో పాల్గొని సైనికుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

ఈ వేడుక‌ల‌కు ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మ‌మ‌రియు సీడీఎస్ జ‌న‌ర‌ల్ అనిల్ చౌహాన్ సైతం హాజ‌ర‌య్యారు. ఈ ఏడాది తొలిసారి కంటోన్మెంట్ బ‌య‌ట బ‌హిరంగ వీధుల్లో ప‌రేడ్ నిర్వ‌హించారు. దీంతో ప్ర‌జ‌లు సైతం సైనికుల‌ను ద‌గ్గ‌ర నుండి చూసే అవ‌కాశం ద‌క్కింది. ఈ వేడుక‌లో నేపాల్ బ్యాండ్, రాజ‌స్థాన్ జాన‌ప‌ద నృత్యాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Next Story