632 బిలియన్ డాలర్లకు చేరిన ఆయుధ విక్రయాలు.. ‘సిప్రి’ నివేదికలో సంచలన విషయాలు

by Kema Shiva Kumar |

ప్రపంచంలోని అతిపెద్ద 100 ఆయుధ తయారీ కంపెనీల ఆర్మ్స్ విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

632 బిలియన్ డాలర్లకు చేరిన ఆయుధ విక్రయాలు.. ‘సిప్రి’ నివేదికలో సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అతిపెద్ద 100 ఆయుధ తయారీ కంపెనీల ఆర్మ్స్ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2023లో ఈ కంపెనీల మొత్తం ఆయుధ అమ్మకాలు 632 అమెరికన్ బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.53 లక్షల కోట్లు) చేరుకున్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక తెలిపింది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా ఆందోళనల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల డిమాండ్ గణనీయంగా పెరిగింది.

అమెరికానే టాప్..

ఆయుధ విక్రయాల్లో అగ్ర దేశమైన అమెరికా కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. టాప్-100లో 51 అమెరికన్ కంపెనీలు ఉండగా, వీటి అమ్మకాలు మొత్తం వాటాలో దాదాపు 50 శాతం కలిగి ఉన్నాయి. చైనా 8 కంపెనీలతో రెండో స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉత్పత్తి సమస్యలతో రష్యా కంపెనీల అమ్మకాలు 10 శాతం తగ్గాయి. భారత్ నుంచి ఒక్క హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మాత్రమే టాప్-100లో 78వ స్థానంలో నిలిచింది. SIPRI నివేదిక ప్రకారం, రానున్న ఏళ్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే ఆయుధ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story