- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నష్టాల ప్రభావం మిలిటరీపై ఉండదు.. పహెల్గాం ఉగ్రదాడి అత్యంత క్రూరమైన చర్య: సీడీఎస్
నష్టాల ప్రభావం మిలిటరీపై ఉండదని సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు. పహెల్గాం ఉగ్రదాడిని అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రొఫెషనల్‌గా ఉండే మిలిటరీలు నష్టాలు ప్రభావితంకావని, మిషన్ కంప్లీట్ అయిందా? లేదా? అని మాత్రమే చూస్తాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. పూణేలోని సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీలో జరిగిన ‘ఫ్యూచర్ వార్స్ అండ్ వార్‌ఫేర్’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత దళాలకు ఎదురైన నష్టాలను గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందరికీ అర్థమయ్యేలా క్రికెట్‌ను ఉదహరించిన సీడీఎస్.. ‘క్రికెట్ మ్యాచ్ గెలిచామనుకోండి. గెలిచినట్లే. అంతేకానీ, ఎన్ని వికెట్లు కోల్పోయాం? ఎన్ని బంతులు మిగిలున్నాయి? ఇలాంటి వన్నీ అనవసరం’ అని చెప్పారు. పహెల్గాం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ (ప్రస్తుత ఫీల్డ్ మార్షల్) ఆసిమ్ మునీర్ ఇచ్చిన ప్రసంగాన్ని కూడా గుర్తుచేసిన ఆయన.. భారత్‌పై, హిందువులపై మునీర్ విషం చిమ్మారన్నారు.
అలాగే పహెల్గాం ఉగ్రదాడి అత్యంత క్రూరమైన చర్య అని, ఆధునిక ప్రపంచంలో ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని ఆయన చెప్పారు. ‘భార్యాపిల్లల ముందే మగవాళ్లను తలపై కాల్చి చంపారు. వాళ్లందర్నీ కేవలం మతం చూసి చంపారు’ అని చౌహాన్ గుర్తుచేశారు. ఇప్పటికి చాలాకాలంగా భారత్‌పై ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటికి 20 వేలమందికిపైగా భారతీయులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వెయ్యి పోట్లతో భారత్ రక్తం కళ్లజూడాలనే (బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్) సిద్ధాంతంతో పాక్ పనిచేస్తోందని, ఇప్పుడు ‘ఆపరేషన్ సిందూర్’తో సీమాంతర ఉగ్రవాదంపై విషయంలో కొత్త లక్ష్మణ రేఖను భారత్ గీసిందని తెలిపారు. ఉగ్రవాదం, అణుబాంబుల బ్లాక్‌మెయిల్‌తో భారత్‌పై ఒత్తిడి తీసుకురాలేరనే విషయాన్ని పాక్‌కు తెలిసేలా చేయడమే ‘ఆపరేషన్ సిందూర్’ లక్ష్యమని సీడీఎస్ చౌహన్ స్పష్టంచేశారు.






