ఉద్యోగం కోసం కెనడా వెళ్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-29 05:53:57  IST  )

కెనడాలో ఉద్యోగం సాధించాలని చాలా మంది భారతీయులు కలలు కంటుంటారు.

ఉద్యోగం కోసం కెనడా వెళ్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!?
X

దిశ,వెబ్‌డెస్క్: కెనడాలో ఉద్యోగం సాధించాలని చాలా మంది భారతీయులు కలలు కంటుంటారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చిన ఉద్యోగం కోసం కెనడా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ఎన్నో ఆశలతో కెనడా వెళ్లాలనుకునే వారికి అక్కడి వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టే ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. కేవలం కొన్ని ఇంటర్న్‌షిప్ ఉద్యోగాల కోసమే వందలాది మంది భారతీయ, ఇతర విదేశీ విద్యార్థులు బారులు తీరారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తీవ్ర చర్చలకు దారి తీస్తుంది.

విషయంలోకి వెళితే.. కెనడాలో నివసిస్తున్న ఓ భారతీయ యువ‌తి ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ప్రకారం.. ఒక చిన్న ఉద్యోగ మేళాకు దరఖాస్తుదారులు బారులు తీరి ఉన్న దృశ్యాలను ఆమె ఆ వీడియోలో పొందుపర్చారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, మెరుగైన జీవనశైలి ఉంటుందని చాలా మంది భారతీయులు భావిస్తారు. కానీ.. అక్కడికి వెళ్లిన తర్వాత వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటాయని ఆమె వివరించారు.

ఒక చిన్న ఉద్యోగానికి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారో చూడండి అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో కెనడాలో వాస్తవ పరిస్థితి ఇదే.. కాబట్టి మీరు దానికి సిద్ధపడితేనే కెనడాకు రండి. లేకపోతే మన భారతదేశమే మేలు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కేవలం 5 నుంచి 6 మందికి మాత్రమే అవకాశం ఉన్న ఈ ఇంటర్న్‌షిప్ కోసం ఇంత పెద్ద క్యూ లైన్ ఏర్పడిందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో విదేశాల్లో జీవితం ఎప్పుడూ కలలమయం కాదు అని ఆమె తేల్చి చెప్పారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కెనడాలో నెలకొన్న పరిస్థితులు, పెరుగుతున్న నిరుద్యోగం పై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో పై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సరైన నైపుణ్యాలు ఉంటే అవకాశాలకు కొదవ లేదని కొందరు, నైపుణ్యాలకు, ఉద్యోగాలకు మధ్య పొంతన లేకపోవడమే అసలు సమస్య అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Next Story