Trump: ట్రంప్ టారీఫ్ ఎఫెక్ట్.. తైవాన్, వియాత్నం కొత్త ప్రాతిపదికలు ఇవే..

by Shamantha N |

రెండోసారి అమెరికా (USA) అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టారీఫ్ లపైనే దృష్టి సారించారు. ఈ సుంకాల దెబ్బకు వియత్నాం, తైవాన్‌ ట్రంప్‌ దారికొచ్చినట్లు స్టోరీలు వస్తున్నాయి.

Trump: ట్రంప్ టారీఫ్ ఎఫెక్ట్..  తైవాన్, వియాత్నం కొత్త ప్రాతిపదికలు ఇవే..
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండోసారి అమెరికా (USA) అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టారీఫ్ లపైనే దృష్టి సారించారు. ఈ సుంకాల దెబ్బకు వియత్నాం, తైవాన్‌ ట్రంప్‌ దారికొచ్చినట్లు స్టోరీలు వస్తున్నాయి. ఇరు దేశాలు అమెరికా వస్తువులపై జీరో టారిఫ్‌లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతీకార సంకాలు ప్రకటించిన 5 రోజుల్లో దాదాపు 50దేశాల నుంచి శ్వేతసౌధానికి ఫోన్‌కాల్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ప్రతీకార సుంకాల బాధిత దేశాల జాబితాలో వియత్నాం, తైవాన్ కూడా ఉన్నాయి. ఈ దేశాలు అన్ని రకాల పన్నులు తొలగించేందుకు రెడీ అయ్యాయి. ఇటీవల వియత్నాంపై అమెరికా 46 శాతం సుంకాలను విధించింది. దీంతో ఆ దేశాధినేత టూ లామ్‌ అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపారు. తర్వాత ఫోన్‌కాల్‌ చర్చల్లో చాలా పురోగతి సాధించినట్లు వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఆ దేశ వస్తులపై జీరో టారీఫ్ వసూలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా రకాల సుంకాలను అమెరికా వస్తువులపై నుంచి తొలగించింది.

తైవాన్ సైతం..

మరోవైపు, తైవాన్ పై అమెరికా 32 శాతం సుంకలు విధించింది. దీంతో, వియత్నాం మర్గాన్నే తైపీ ఎంచుకుంది. దీంతో ఆ దేశాధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె ఆదివారం కీలక సమావేశం నిర్వహించి.. అమెరికాతో వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని నిర్ణయించారు. తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ సంస్థ అమెరికాతో ఒప్పందం చేసుకుంది. అగ్రరాజ్యంలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, భారత్, ఇండోనేషఇయా దేశాలు కూడా ప్రతీకార సుంకాల జోలికి వెళ్లొద్దనే నిర్ణయం తీసుకుంది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తున్నాయి.

Next Story