Apple: భవిష్యత్తులో అన్ని ఐఫోన్‌ల తయారీ భారత్‌లోనే: జ్యోతిరాదిత్య సింధియా

by S Gopi |

ప్రభుత్వ విధానాలు, తయారీకి ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా టెక్ సంస్థలను భారత్ ఆకర్షిస్తోంది.

Apple: భవిష్యత్తులో అన్ని ఐఫోన్‌ల తయారీ భారత్‌లోనే: జ్యోతిరాదిత్య సింధియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భవిష్యత్తులో యాపిల్ ఐఫోన్‌లన్నీ భారత్‌లోనే తయారవుతాయని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ఇప్పటికే అమెరికాలో విక్రయించే ఎక్కువ భాగం ఐఫోన్‌లు భారత్ నుంచే ఎగుమతి అయ్యాయని ఆయన తెలిపారు. మంగళవారం భారత్ టెలికాం కార్యక్రమంలో మాట్లాడిన సింధియా.. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌ను పెట్టుబడి కేంద్రంగానే కాకుండా,ఆర్థిక విజయానికి సరైన నిర్ణయంగా చూస్తోందని, ముఖ్యంగా తయారీ కంపెనీలన్నీ ఇదే ఉద్దేశంతో పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ విధానాలు, తయారీకి ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా టెక్ సంస్థలను భారత్ ఆకర్షిస్తోంది. అందుకే యాపిల్ తన అన్ని స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయాలని నిర్ణయించిందని సింధియా పేర్కొన్నారు. కాగా, ఇటీవల కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం వాటాదారులతో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అమెరికాలో విక్రయించే ఎక్కువ భాగం ఐఫోన్‌లు భారత్ నుంచే వస్తాయని తెలిపారు. ఇదే కార్యక్రమంలో టెలికాం రంగం వృద్ధిపై మాట్లాడిన సింధియా..ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ద్వారా రూ. 4,000 కోట్ల పెట్టుబడులతో రూ. 80 వేల కోట్ల అమ్మకాలు జరిగాయని, రూ. 16 వేల కోట్ల ఎగుమతులు, 25,000 ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు.

Next Story