- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్లు ఇక ‘టాటా’ చేతిలో!
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్లు ఇక ‘టాటా’ చేతిలోకి రానున్నాయి. దీని కోసం ఇప్పటికే టాటా గ్రూప్, యాపిల్ ఒప్పందం చేసుకున్నాయంట.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌ల రిపేర్ బాధ్యతలను టాటా గ్రూపునకు అందించాలని ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ నిర్ణయించింది. ప్రస్తుతం భారత్‌లో యాపిల్ మార్కెట్ వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాటాతో తాజాగా యాపిల్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మ్యానుఫాక్చరింగ్‌లో కూడా చైనా నుంచి పక్కకు వచ్చేయాలని చూస్తున్న యాపిల్‌కు భారత్‌లో టాటా గ్రూప్ మంచి భాగస్వామిగా కనిపించింది. ప్రస్తుతం భారత్‌తోపాటు విదేశీ మార్కెట్లకు పంపుతున్న ఐఫోన్లలో చాలావరకు టాటా కంపెనీ అసెంబుల్ చేసినవే కావడం గమనార్హం.
భారత్‌లో మూడు చోట్ల యాపిల్ అసెంబుల్ కేంద్రాలున్నాయి. వీటిలో ఒక చోట కొన్ని ఐఫోన్ పరికరాలను కూడా తయారు చేస్తున్నారు. ఇంతకాలం తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కంపెనీ భారతీయ యూనిట్.. ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్లను చూసుకునేది. తాజా డీల్‌తో ఈ బాధ్యతలు టాటా గ్రూప్ చేతికి దక్కనున్నాయి. కర్ణాటకలోని ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌లో ఈ రిపేర్లు చేస్తారని సమాచారం.






