- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: దివ్యాంగుల మనసు నొప్పించే జోకులు ఇంకెప్పుడు ఆపుతారు
స్టాండప్ కామెడీ పేరు మీద దివ్యాంగులను టార్గెట్ చేయడం తగిన విషయం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: వికలాంగుల హక్కుల గురించి అవగాహన పెంచేందుకు తమ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడానికి తగిన చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం పలువురు కమెడియన్లకు సూచించింది. ఈ సందర్భంగా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేసే కమెడియన్లపై తీవ్రస్థాయిలో మండిపడింది. స్టాండప్ కామెడీ పేరు మీద దివ్యాంగులను టార్గెట్ చేయడం తగిన విషయం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమయ్ రైనా, విపున్ గోయల్ సహా పలురువు కమెడియన్లు దివ్యాంగులను బాధపెట్టేలా జోకులు వేసినట్టు క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైవ్యాఖ్యలు చెసింది. ఇలాంటి షోలలో అనుచితంగా కామెడీ చేసిన కారణంగా తమ సోషల్ మీడియాలతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. సమయ్ రైనా, విపున్ గోయల్‌తో పాటు బలరాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి టక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్‌లకు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్లతో కలిపి దీన్ని విచారించింది.
తమ వ్యాఖ్యలను కమర్షియలైజ్ చేయడమనేది బాధ్యతతో వస్తుంది. ప్రస్తుత తరంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు దీన్ని గ్రహించాలి. సమాజంలోని కొన్ని వర్గాలను బాధపెట్టడానికి సమాజాన్ని ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో వికలాంగులతో సహా అన్ని వర్గాల గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో భాషను ఉపయోగించడంపై సమగ్ర మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ధర్మాసనం ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఒకే సంఘటనకు మాత్రమే పరిమితంగా ఉండకూడదని, సాంకేతిక పురోగతి వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. నియమాలను రూపొందించేటప్పుడు వికలాంగుల సంక్షేమ జాతీయ బోర్డు (ఎన్‌బీడీఎస్ఏ), ఇతరులను సంప్రదించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది.
జీవితంలో హాస్యం ఒక భాగమే. ఇతరులను ఎగతాళి చేయడం మొదలైనప్పుడే, సున్నితత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. మనదేశంలో అనేక వర్గాలు ఉంటాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు తమ వ్యాఖ్యల విషయంలో జాగ్రత్త, బాధ్యత పెరగాలని కోర్టు అభిప్రాయపడింది. ఇతరుల మనోభావాలు దెబ్బతీయడాన్ని ఏ మాత్రం సహించలేమని తెలిపింది.
దీనికి సంబంధించి సమయ్ రైనా తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తూ.. ఇన్‌ఫ్లుయెన్సర్లు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ కోర్టు ముందు హాజరయ్యారని చెప్పారు. ఇలాంటి ధోరణి ఆగేదెన్నడు? దీనిపై తాము జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది. బంగరంగంగానే కాకుండా తమ యూట్యూబ్ ఛానెళ్లలో వారంతా క్షమాపణలు చెప్పాలని పేర్కొంది.






