Anti ship: యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు.. రష్యాతో భారత్ అగ్రిమెంట్

by B.Srinivas |   (  Updated:2025-02-04 17:19:18  IST  )

భారత నావికాదళ పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచే యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

Anti ship: యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు.. రష్యాతో భారత్ అగ్రిమెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత నావికాదళ పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచే యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల (Anti-ship cruise missiles) కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్‌పై రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ (Rajesh kumar singh) సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకం చేశారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ‘రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల సేకరణకు రక్షణ మంత్రిత్వ శాఖ రష్యాతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ క్షిపణులు ఇండియన్ నేవీకి చెందిన జలాంతర్గాముల పోరాట సామర్థ్యాలను మరింత పెంచుతాయి’ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఈ క్రమంలో రష్యా ప్రతినిధి వ్యాచెస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ భారత్‌ (India), రష్యా (Russia)ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు.

Next Story