- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంటగాన్ కండీషన్‌పై వెనక్కి తగ్గని ఆంథ్రోపిక్.. CEO డారియో అమోడెయ్ కీలక నిర్ణయం
AI భద్రతా నిబంధనలను తొలగించాలన్న పెంటగాన్ అల్టిమేటమ్‌ను ఆంత్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ సంచలన నిర్ణయంతో తిరస్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా రక్షణ శాఖ, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఆంథ్రోపిక్’ మధ్య వివాదం ముదిరింది. తమ AI మోడల్ ‘క్లాడ్’ (Claude)పై ఉన్న భద్రతా నిబంధనలను (Guardrails) తొలగించాలన్న పెంటగాన్ అల్టిమేటమ్‌ను ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. సైనిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ తంత్రాల్లో AIని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉపయోగించుకునేలా అనుమతించాలని పెంటగాన్ కోరింది. అయితే, అందుకు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఇవాళ సాయంత్రం లోపు ఆంత్రోపిక్ తన నిబంధనలను సడలించాలని గడువు విధించగా, సీఈవో పెంటగాన్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
అయితే, అమెరికన్ పౌరులపై మాస్ సర్వేలెన్స్ పెట్టడానికి AIని వాడకూడదని ఆంథ్రోపిక్ వాదిస్తోంది. మనుషుల ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకునే ప్రాణాంతక ఆయుధ వ్యవస్థల్లో AIని ఉపయోగించకూడదని పేర్కొంది. మరోవైపు ‘ఆంథ్రోపిక్’ గనుక తమకు లొంగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని యూఎస్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆంథ్రోపిక్‌ను సప్లయ్ చెయిన్ రిస్క్‌గా ప్రకటించి, ఏ ప్రభుత్వ కాంట్రాక్టర్ కూడా ఆ సంస్థ టెక్నాలజీని వాడకుండా నిషేధం విధిస్తామని ఆ సంస్థ సీఈవో డారియో అమోడెయ్‌కు వార్నింగ్ ఇచ్చింది. అదేవిధంగా జాతీయ భద్రత దృష్ట్యా చట్టాన్ని ప్రయోగించి, బలవంతంగా ఆంథ్రోపిక్ టెక్నాలజీని స్వాధీనం చేసుకుంటామని పెంటగాన్ చెబుతోంది.
కాగా, ఎలోన్ మాస్క్‌కు చెందిన xAI వంటి సంస్థలు ఇప్పటికే పెంటగాన్ నిబంధనలకు అంగీకరించగా.. ఆంత్రోపిక్ మాత్రం ‘AI’ భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. తమ మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించలేమని అమోడెయ్ పేర్కొనడం ఇప్పుడు అంతర్జాతీయ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.






