- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరాకు మరో వారం కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు అమిత్ అరోరాకు మరో వారం పాటు సీబీఐ కోర్టు ఈడీ కస్టడీని పొడిగించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు అమిత్ అరోరాకు మరో వారం పాటు సీబీఐ కోర్టు ఈడీ కస్టడీని పొడిగించింది. కస్టడీ ముగియడంతో అమిత్ అరోరాను బుధవారం ఈడీ అధికారులు సీబీఐ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు. గత నెల 30న అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. వారం రోజులుగా అమిత్ అరోరాతో పాటు మరో 9 మందిని ప్రశ్నించిన ఈడీ వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరించింది. అరోరాను కలిసిన మరో ఆరుగురిని ప్రశ్నించాల్సి ఉందని ఇందుకోసం మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి అమిత్ అరోరాకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కీలక దశలో ఉంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో తొలిసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో కవితను ఈ నెల 11వ తేదీని సీబీఐ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆమెను ప్రశ్నించబోతోంది.






