- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో సర్జికల్ స్ట్రైక్ తప్పేట్టు లేదు.. కేంద్రం మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Union Minister Ramdas Athawale) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Union Minister Ramdas Athawale) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన లోనావానా (Lonavala)లో మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను తమకు తాముగా భారత్‌కు అప్పగించాలని అన్నారు. లేని పక్షంలో పాకిస్థాన్ (Pakistan)పై యుద్ధం ప్రకటించాల్సి ఉంటుందని కామెంట్ చేశారు.
తరచు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారని.. అందుకు ఉదాహరణ ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడేనని అన్నారు. భారత సైన్యం (Indian Army) మరో సర్జికల్ స్ట్రైక్ (Surgical Strike) చేయక తప్పేట్టు లేదని కామెంట్ చేశారు. దాయాదా పాక్‌ను ఎదుర్కో్వడంలో ప్రభుత్వానికి ప్రతిపక్షలు ఐక్యతను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ (Jammu Kashmirలో పర్యాటక సందడి పెరిగిందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభిస్తోందని అన్నారు. అదే ఓర్వలేకే కుఠిల బుద్ధితో పాక్ మనదేశంపై ఉగ్రవాదులను ఉసిగొల్పుతోందని రాందాస్ అథవాలే ఆరోపించారు.






