రాజకీయాల్లోకి మరో స్టార్ హీరోయిన్..?

by Disha Web Desk 5 |
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరోయిన్..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాల్లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ తండ్రి, భాగల్ పూర్ ఎమ్మెల్యే అజిత్ శర్మ స్వయంగా బయటపెట్టాడు. తెలుగులో రామ్ చరణ్ మొదటి సినిమా అయిన చిరుత లో నటించిన నేహాశర్మ ఇప్పుడు రాజకీయ అరంగ్రేట్రం చేయనుందని తెలుస్తొంది. బీహార్ లో కూటముల మధ్య సీట్ల పంపకాలపై జోరుగా చర్చ జరుగుతున్న తరుణంలో భాగల్ పూర్ ఎమ్మె్ల్యేగా ఉన్న అజిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నుంచి కాంగ్రెస్ కి 8 నుంచి 9 స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న భాగల్ పూర్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నందున పొత్తులో భాగంగా కాంగ్రెస్ కే కేటాయించే అవకాశం ఉందని, ఈ స్థానం నుంచి తన కుమార్తె నేహా శర్మకు టికెట్ దక్కే చాన్స్ ఉందని అన్నారు. అలాగే సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని, తమకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. అంతేగాక, తనను అడిగితే పోటీ చేస్తానని, లేదా తన కుమార్తె పోటీ చేయవచ్చని, సీట్ల పంపకాల వరకు వేచి చూడాలని మీడియా ముఖంగా అజిత్ శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read More..

చిత్తూరులో మిస్టరీగా మారిన కార్మికుడి మృతి.. యజమానే చంపేశారా..?



Next Story

Most Viewed