- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన టైమ్స్ స్వ్కేర్
న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్‌లో (New York Times Square) ఇవాళ తెల్లవారుజామున 1:20 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు (Shooting) మోత మోగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్‌లో (New York Times Square) ఇవాళ తెల్లవారుజామున 1:20 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా టైమ్స్ స్వ్కేర్ వద్ద ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడగా, స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సి అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 17 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, రద్దీగా ఉండే ఈ పర్యాటక ప్రాంతంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన మరోసారి అమెరికాలో గన్ కల్చర్ (Gun Culture) పై తీవ్ర చర్చకు దారితీసింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంలో రద్దీ సమయాల్లో ఇటువంటి కాల్పులు జరగడం అంటే, ప్రజల భద్రతపై ఎదురయ్యే సవాళ్లను స్పష్టంగా చూపిస్తోంది.






