అమెరికాలో మళ్లీ కాల్పులు.. స్పాట్‌లోనే నలుగురు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-11 16:51:26  IST  )

అగ్రరాజ్యం అమెరికా ఇటీవలి కాల్పులతో అట్టుడుకుతోంది.

అమెరికాలో మళ్లీ కాల్పులు.. స్పాట్‌లోనే నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) ఇటీవలి కాలంలో కాల్పులతో అట్టుడుకుతోంది. తాజాగా, మిసిసిపీ (Mississippi)లో అర్ధరాత్రి వేళ కాల్పుల మోత మోగింది. లేలాండ్‌ (Leland) పట్టణంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో నలుగురు బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా గాయపడ్డారు. మిసిసిపీ రాష్ట్ర సెనెటర్ డెరిక్ సిమ్మన్స్ (Derrick Simmons) కాల్పలను సైతం ధృవీకరించారు. స్టూడెంట్స్ గెట్‌ టు గెదర్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అనంతరం అందరూ ఒకేచోటకు చేరి సంబురాలు చేసుకుంటున్న సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ మేరకు గాయపడిన వారిని పోలీసులు జాక్సన్ (Jackson) నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story