- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ranya Rao : నటి రన్యా రావుకు కోర్ట్ మరో షాక్
బంగారం స్మగ్లింగ్ కేసు(Gold Smuggling Case)లో నటి రన్యా రావు(Actress Ranya Rao)కి కోర్ట్ షాకిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : బంగారం స్మగ్లింగ్ కేసు(Gold Smuggling Case)లో నటి రన్యా రావు(Actress Ranya Rao)కి కోర్ట్ షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన బెంగళూరు సెషన్స్ కోర్టు(Bengaluru sessions Court).. బెయిల్ ను తిరస్కరించింది. ఈ కేసులో రన్యా బెయిల్ కోసం అప్లై చేసుకోవడం ఇది మూడవసారి. కాగా రన్యా మార్చి 3న బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి 14.2కేజీల బంగారం(సుమారు 12.56 కోట్ల రూపాయల విలువ)స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టు బడింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ఈ కేసులో మరో వ్యక్తి బళ్ళారి వ్యాపారి సాహిల్ జైన్(Sahil Jain) మార్చి 26న అరెస్టయ్యాడు. అతను బంగారాన్ని విక్రయించడంలో రన్యాకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతను నాలుగు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నాడు. మరోవైపు రన్యా సవతి తండ్రి డీజీపీ రామచంద్ర రావును అధికారులు సెలవులో పంపారు. తనను శారీరకంగా హింసించి స్మగ్లింగ్ చేయించారని నటి ఆరోపించినప్పటికీ.. హవాలా మార్గం ద్వారా బంగారం కొనేందుకు డబ్బు ట్రాన్సఫర్ చేసినట్టు ఆమె కోర్టులో ఒప్పుకున్నారు.






