Chhattisgarh : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నలుగురు కీలక సభ్యుల అరెస్ట్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-25 15:35:02  IST  )

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుర్గుజా జిల్లా పరిధిలోని పర్సేఘడ్‌(Parseghad)లో పోలీసులు నేడు నలుగురు మావోయిస్టులను(Maoists) అరెస్టు చేశారు.

Chhattisgarh : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నలుగురు కీలక సభ్యుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుర్గుజా జిల్లా పరిధిలోని పర్సేఘడ్‌(Parseghad)లో పోలీసులు నేడు నలుగురు మావోయిస్టులను(Maoists) అరెస్టు చేశారు. అరెస్టయినవారు సంజయ్ కొర్రామ్, సంతోష్ కుమార్, సురేష్, మనోజ్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిపై గతంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకొని IED బాంబులతో దాడులు చేసిన ఆరోపణలు ఉన్నాయి. పర్సేఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై రహస్య సమాచారం అందుకున్న పోలీసులు, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టులు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో 10 కిలోల ఐఇడీ బాంబు, డిటోనేటర్లు, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో పాల్గొన్నారని, సుర్గుజా, బలరాంపూర్ జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారనిసుర్గుజా ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు.

Next Story