డొనాల్ట్ ట్రంప్‌నకు మరో పరాభవం.. 10 శాతం ఇంటర్నేషనల్ టారీఫ్‌లకు కోర్టు బ్రేక్

by Kema Shiva Kumar |

ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకాలు విధించాలన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా కోర్టు తోసిపుచ్చింది.

డొనాల్ట్ ట్రంప్‌నకు మరో పరాభవం.. 10 శాతం ఇంటర్నేషనల్ టారీఫ్‌లకు కోర్టు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America) ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పేరుతో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన వివాదాస్పద అంతర్జాతీయ పన్నుల విధానానికి అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. విదేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు విధించాలన్న ఆయన నిర్ణయం చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. విదేశీ వస్తువులపై అదనపు పన్నులు విధిస్తే అమెరికాలోని సామాన్య ప్రజలపై ధరల భారం పెరుగుతుందని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అధ్యక్షుడికి ఉండే వాణిజ్య అధికారాలను ఈ నిర్ణయం అతిక్రమిస్తోందని కోర్టు పేర్కొంది. కేవలం ఎంపిక చేసిన వస్తువులపై కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వచ్చే అన్ని ఉత్పత్తులపై ఒకేసారి పన్ను వేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. అమెరికాలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, చైనా వంటి దేశాలతో వాణిజ్య లోటును తగ్గించడానికి ఈ 10 శాతం టారిఫ్‌లు అవసరమని ట్రంప్ తరఫు న్యాయవాదులు తమ వాదనను బలంగా వినిపించారు. అయితే ఆ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.

ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్..

డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 10 శాతం టారిఫ్ విధానం అమలులోకి వస్తే.. భారత్, చైనా, ఐరోపా దేశాల నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులు భారీగా దెబ్బతినేవి. కోర్టు తాజా తీర్పుతో అంతర్జాతీయ వాణిజ్య వర్గాలకు, ముఖ్యంగా ఎగుమతిదారులకు పెద్ద ఊరట లభించినట్లైంది.

Next Story