- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shimla Agreement Cancelled : పాక్ మరో సంచలన నిర్ణయం.. "సిమ్లా ఒప్పందం" రద్దు
పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాక్ పట్ల భారత్ పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాక్ పట్ల భారత్ పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా భారత్ నిర్ణయాలపై పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలు దిగుతోంది. అందులో భాగంగా.. తక్షణమే భారత పౌరులు పాక్ ను విడిచి వెళ్లాలని తేల్చి చెప్పింది. భారత విమానాలు ఎగిరే పాక్ గగనతలాన్ని మూసివేసింది. అట్టారి-వాఘా బార్డర్ ను కూడా మూసివేసింది(Attari-Vagha Boarder Closed). భారతీయులకు జారీ చేసే సార్క్ వీసాలను రద్దు చేసింది. ఇకపై భారత్ తో అన్ని వ్యాపార సంబంధాలు, దౌత్య సంబంధాలు తెగ తెంపులు చేసుకుంటున్నామని స్పష్టం చేసింది. భారత్ తీసుకున్న "సింధు నదీ జలాల ఒప్పందం"(Indus River Waters Treaty) రద్దుకు ప్రతీకారంగా పాక్ "సిమ్లా ఒప్పందాన్ని రద్దు"(Shimla Agreement Cancelled) చేసుకుంటునట్టు ప్రకటించింది. భారత్-పాక్ మధ్య 5 దశాబ్దాల క్రితం చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేసుకోవడం తీవ్ర చర్యగా భారత్ భావిస్తోంది. ఇది ప్రత్యక్ష యుద్ధానికి తెర లేపడమేనని భారత్ స్పష్టం చేసింది.
ఏమిటీ సిమ్లా ఒప్పందం..
1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య 1972లో "సిమ్లా ఒప్పందం"(Shimla Agreement) కుదిరింది. ఇది రెండు దేశాల మధ్య శాంతి ఇప్పందం. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోలు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను భారతదేశం- పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ(LOC)గా మార్చారు. అంతేకాకుండా.. భారత్, పాక్ మధ్య యుద్ధ ఖైదీలు తిరిగి రావడం, సరిహద్దుల్లో దళాలను ఉపసంహరించుకోవడం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్ వివాదాలను పరిష్కరించుకుంటామని ఒప్పందంలో పొందు పరిచారు. అంటే, కాశ్మీర్ సహా అనేక విషయాలను ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్ ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించగా.. ఇకపై ఈ రెండు దేశాల మధ్య సమస్యల్లో మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం కల్పించడమే. ఈ ఒప్పందం వలనే గతంలో పలు సందర్భాల్లో కాశ్మీర్ ఇష్యూలో కలగజేసుకునేందుకు ఐక్యరాజ్యసమితి కూడా నిరాకరించింది.






