- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan : పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం... బాలీవుడ్ పాటలపై నిషేధం
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attock) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attock) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ వీసాలు రద్దు చేయడమే కాకుండా పాకిస్తానీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలిచ్చింది. అలాగే అటారి బోర్డర్ ను మూసి వేయడంతో పాటు, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పలు పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెల్స్ పై కూడా నిషేధం విధించింది. అలాగే పాక్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలే తీసుకుంది. భారత్ వీసాలు రద్దు చేస్తూ, భారతీయులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇక సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా భారత విమానాలకు పాక్ గగన తలాన్ని మూసివేసింది.
తాజాగా పాక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాక్ లో బాలీవుడ్ సంగీతాన్ని నిషేధిస్తూ(Bollywood Music Ban) ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆ దేశపు FM రేడియోల్లో మన దేశపు పాటలు ప్లే చేయకూడదని పాకిస్థాన్ బ్రాడ్ కస్టర్స్ అసోసియేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇకపై ఆ దేశంలోని అన్ని FM రేడియోల్లో బాలీవుడ్ పాటలు వినిపించవు. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకొని పాక్ సెల్ఫ్ గోల్ వేసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంతో పాక్ రేడియోలకు ఆడియన్స్ తగ్గి మరింత నష్టపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు.






