స్టేట్ పాలిటిక్స్‌లో మరో సంచలనం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేప్ కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-28 03:57:03  IST  )

కేరళ (Kerala) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.

స్టేట్ పాలిటిక్స్‌లో మరో సంచలనం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేప్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ (Kerala) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. పాలక్కాడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాహుల్ మాంకూట్టత్తిల్‌ (Rahul Rahul Mankootathil)పై రేప్ కేసు నమోదైంది. దీంతో త్వరలోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 2025 ఆగస్టులో మొదలైన ఈ వివాదంలో ఇవాళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే రాహుల్ మాంకూట్టత్తిల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సదరు మహిళ గర్భం దాల్చగా, తనకు బలవంతంగా ఎమ్మెల్యే అబార్షన్ చేయించినట్లు బాధితురాలు ఆరోపించింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే రాహుల్ మాంకూట్టత్తిల్‌పై IPC సెక్షన్ 376, సెక్షన్ 354A ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

కాగా, ఆగస్టు 2025లో ఒక మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి ఎమ్మెల్యే రాహుల్ తనకు అసభ్యకర ఎస్ఎంఎస్‌ (SMS)లు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా అతను యువజన కాంగ్రెస్‌ (Youth Congress)లో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఎమ్మెల్యే మాంకూట్టత్తిల్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అతని ప్రాథమిక సభ్యత్వాన్ని 6 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఆయన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ ఇంకా ఎమ్మెల్యే పదవిని కొనసాగిస్తున్నారు. సొంత పార్టీలోని మహిళా నాయకులు మాజీ ఎమ్మెల్యే షానిమోల్ ఉస్మాన్, ఎమ్మెల్యే ఉమా థామస్ రాహుల్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అధికార సీపీఎం (CPM), విపక్ష బీజేపీ (BJP)లు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Next Story