- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DRDO మరో అరుదైన ఘనత.. ‘అగ్ని ప్రైమ్’ క్షిపణి విజయవంతం
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో అరుదైన ఘనత సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో అరుదైన ఘనత సాధించింది. బుధవారం అర్ధరాత్ర ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బాలసోర్ (Balasore) ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించిన ‘అగ్ని ప్రైమ్’ (Agni Prime) క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి నిర్వహించే క్షిపణిగా అగ్రి ప్రైమ్ నిలిచింది. ఈ సామర్థ్యం ప్రస్తుతం కొన్ని దేశాలకు మాత్రమే ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో స్వేచ్ఛగా కదలగల ఈ వ్యవస్థ, తక్కువ సమయంలో మరియు తక్కువ గుర్తింపుతో క్షిపణులను ప్రయోగించే సౌలభ్యాన్ని అందిస్తుంది.
అదేవిధంగా సైన్యానికి తక్కువ సమయంలో ఎక్కవ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా అగ్ని ప్రైమ్ అందించనుంది. ‘అగ్ని ప్రైమ్’ క్షిపణి భారతదేశ రక్షణ వ్యవస్థలో ఒక అధునాతన బాలిస్టిక్ క్షిపణి (Ballistic missile)గా పరిగణించబడుతుంది. అగ్ని ప్రైమ్‌కు అణు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఇది భారతదేశ రక్షణ వ్యూహంలో శత్రు దేశాలపై నిరోధక శక్తిగా పని చేయనుంది. అగ్ని ప్రైమ్ వెయ్యి నుంచి 2 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా ఇది దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశ రక్షణ వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది.






