మరో భారీ ఎన్‌కౌంటర్.. తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-06 12:03:43  IST  )

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బీజాపూర్(Bijapur) జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది.

మరో భారీ ఎన్‌కౌంటర్.. తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బీజాపూర్(Bijapur) జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అడెల్లు అలియాస్ భాస్కర్ అనే కీలక మావోయిస్టు మృతిచెందారు. భాస్కర్ మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈయన ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు కావడం గమనార్హం. బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం(National Park Forest)లో శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో AK-47 గన్, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గురువారం కూడా బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం మృతిచెందాడు. అతడు సుధాకర్‌గా పార్టీలో ప్రసిద్ధి చెందిన నాయకుడిగా భద్రతా బలగాలు గుర్తించాయి. గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్‌పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నట్లు నిర్ధారించారు. ఆయన మృతిచెందిన మరుసటి రోజు కూడా ఎన్‌కౌంటర్ జరగడం, మరో కీలక మావోయిస్టు మృతి చెందటం కలకలం రేపుతోంది.

Next Story