- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ
మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని గరియాబంద్ జిల్లా ఉదంతి ఏరియా కమిటీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారు. పెద్ద సంఖ్యలో లొంగిపోయారు. ఒకేసారి ఏడు నుండి ఎనిమిది మంది కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. వీరంతా ఆయుధాలతో లొంగిపోయారని స్థానిక ఎస్పీ నిర్ధారించారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం చెబుతూ.. రివార్డులు అందజేశారు. ఇటీవలే 210 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వారి నుంచి 153 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని.. దీంతో అబుజ్మద్ ప్రాంతాన్ని దాదాపు నక్సల్స్ రహితంగా ప్రకటించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఉదంతి ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు, సినపలి ఏరియా కమీటీకి చెందిన ఇద్దరు ఉన్నట్లు సమాచారం.
Next Story






