Couple Kissing Inside Delhi Metro :మెట్రోలో మరో ప్రేమ జంట ముద్దుల రచ్చ

by Disha Web Desk 9 |
Couple Kissing Inside Delhi Metro :మెట్రోలో మరో ప్రేమ జంట ముద్దుల రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మెట్రో రైలులో యువత తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ డాన్స్‌లు చేశారు. తాజాగా ఓ ప్రేమ జంట మెట్రోలో ముద్దులు పెట్టుకుంటోన్న ఘటన దిల్లీ మెట్రోలో ఆలస్యంగా చోటుచేసుకుంది. రైలు కంపార్ట్‌మెంట్‌లో ఓ యువతి, యువకుడు కిస్ పెట్టుకుంటూ గలీజ్ పనులు చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు పలు రకాల ట్రోల్ చేస్తున్నారు. దీంతో దిల్లీ మెట్రో అధికారులు స్పందించి.. “హాయ్ మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. హుడా సిటీ సెంటర్‌లో తనిఖీ చేశాం. అలాంటి ప్రయాణీకులు కనిపించలేదు” అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను కూడా నెటిజన్లు మరో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ప్రయాణికులు ఇంకా అక్కడే ఉంటారా? ఆఫీసర్లకు ఆ మాత్రం అర్థం కాదా? అంటూ మండిపడుతున్నారు.

Couple Kissing Inside Delhi Metro Goes Viral

Also Read..

మెట్రోలో యువ జంట రొమాన్స్.. CPR చేస్తున్నాడని కామెంట్స్ (వీడియో)

Next Story

Most Viewed