టాటా గ్రూపు మరో కీలక నిర్ణయం.. ఎయిరిండియా బాధితుల కోసం ట్రస్ట్‌ ఏర్పాటు

by Gantepaka Srikanth |

టాటా గ్రూపు(Tata Group) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఎయిరిండియా(Air India) విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసింది.

టాటా గ్రూపు మరో కీలక నిర్ణయం.. ఎయిరిండియా బాధితుల కోసం ట్రస్ట్‌ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూపు(Tata Group) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఎయిరిండియా(Air India) విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసింది. దాదాపు రూ.500 కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. త్వరలోనే కంపెనీ బోర్డు నుంచి ట్రస్ట్‌కు ఆమోదం లభించే అవకాశం కనిపిస్తున్నాయి. తాజాగా ట్రస్ట్‌కు కేటాయించే సొమ్ముతో 271 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, మెడికల్‌ కాలేజీ పునరుద్ధరణ, సమీపంలో విమాన శకలాల కారణంగా దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టనుంది. మిగిలిన మూల నిధిని బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలు తీర్చడానికి వినియోగించాలని భావిస్తున్నారు.

Next Story