మరో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా క్రాష్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-05 05:10:16  IST  )

వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి.

మరో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా క్రాష్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్లే ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్కడి కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం బయలుదేరిన యూపీఎస్ ఫ్లైట్ 2976 మెక్‌డొనెల్ డగ్లస్ MD-11F కార్గో విమానం టేకాఫ్‌లోనే కూలిపోయి భారీ పేలుడుకు గురైంది. హవాయి రాష్ట్రంలోని హొనోలులు డేనియల్ కె. ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఆ ఫ్లైట్‌లో మొత్తం ముగ్గురు సిబ్బంది సహా 11 మంది ఉన్నారు. అందులో దాదాపు 280,000 పౌండ్ల (సుమారు 42,000 గ్యాలన్లు) జెట్ ఇంధనం ఉండటంతో పేలుడు తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు మరణించగా.. మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని విమాన శకలాలను తొలగిస్తున్నారు. అయితే, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ తెలిపారు.

Next Story