- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake: టిబెట్‌లో మరోసారి భూకంపం
టిబెట్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: టిబెట్‌లో (Tibet) శుక్రవారం భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. ఉదయం 9:27 గంటల సమయంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (National Seismological Center) వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని వెల్లడించింది. కాగా, ఈ నెలలో భూకంపం సంభవించటం ఇది మూడోసారి. ఈనెల 8న రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకోగా, ఈనెల 12న 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. టిబెటన్ పీఠభూమి ప్రాంతం భూకంపాలకు నిలయంగా ఉంటుందని, టెక్టోనిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తాయని భౌగోళిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఇవాళ అర్ధరాత్రి 1:33 గంటల ప్రాంతంలో భూమికి 10 కిలో మీటర్ల లోతులో నేపాల్‌లో సైతం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది.






