రష్యాలో మరోసారి భూకంపం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-02 03:58:24  IST  )

రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది.

రష్యాలో మరోసారి భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: రష్యాలో (Russia) మరోసారి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. కురిల్ దీవుల తూర్పు ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు సెంటర్ ఫర్ నేషనల్ సెస్మాలజీ తెలిపింది. తాజా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. భూకంప తీవ్రత నేపథ్యంలో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. కాగా, రష్యాలోని కమ్‌చట్కా ద్వీపకల్పం (Kamchatka peninsula)లో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 4.4 అంతకంటే ఎక్కువ తీవ్రతతో 125 సార్లు భూమి కంపించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. వాటిలో మూడు 6.0 తీవ్రతకంటే ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. అయితే,వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Next Story