- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ఆప్‌కు షాక్
మొత్తంగా చూస్తే ఇప్పుడు బీజేపీకే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. దీంతో మేయర్ ఎన్నికను సులువుగా గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.

- బీజేపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు
- త్వరలో మేయర్ ఎన్నికలు
- పెరిగిన బీజేపీ బలం
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో అధికారం కోల్పోయిన వారం రోజులకే ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఢిల్లీ కార్పొరేషన్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరి చేరికతో త్వరలో జరగబోయే మేయర్ ఎన్నికలో బీజేపీ గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పీఠాన్ని కూడా బీజేపీ గెలవబోతోంది. ఇకపై ఢిల్లీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉండబోతోందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ శనివారం తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో, ఢిల్లీ కార్పొరేషన్‌లో బీజేపీనే ఉంటుంది. ఇదే దేశ రాజధానిని మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి సరైన సమయం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్‌కు చెందిన అనితా బసోయా (ఆండ్రూస్ గంజ్ వార్డు), నిఖిల్ ఛప్రానా (హరినగర్ వార్డు), ధరమ్‌వీర్ (ఆర్కేపురం వార్డు) కౌన్సిలర్లు బీజేపీలో జాయిన్ అయ్యారు. పరిశుభ్రమైన, అందమైన ఢిల్లీగా మార్చడానికే కౌన్సిలర్లు బీజేపీలో చేరారని సచ్‌దేవ వ్యాఖ్యానించారు.
ఎంసీడీ మేయర్ ఎన్నికలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. 2024 నవంబర్‌లో నిర్వహించిన మేయర్ ఎన్నికలో ఆప్ మూడు ఓట్ల తేడాతో విజయం సాధించింది. 2020లో జరిగిన ఎంసీడీ ఎణ్నికల్లో ఆప్ 134 వార్డులు, బీజేపీ 104, కాంగ్రెస్ 9, ఇండిపెండెంట్లు మూడు వార్డులు గెలిచారు. కాగా, ప్రస్తుతం మారిన ముగ్గురు కౌన్సిలర్లతో పాటు బీజేపీ తన 10 మంది ఎమ్మెల్యేలను ఎంసీడీకి నామినేట్ చేయనుంది. దీంతో పాటు ఏడుగురు బీజేపీ లోక్‌సభ ఎంపీలు కూడా నామినేట్ అవుతారు. ఆప్ తన ముగ్గురు రాజ్యసభ సభ్యులతో పాటు మరో నలుగరు ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు బీజేపీకే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. దీంతో మేయర్ ఎన్నికను సులువుగా గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.






