- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. గంటకు పైగా గాల్లోనే చక్కర్లు
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో గంటకు పైగా సముద్రంలోనే ఆ విమానం చక్కర్లు కొట్టింది. ముంబై నుండి న్యూయార్క్ వెళ్లాల్సిన AI191 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటు చేసుకోగా, వెంటనే పైలట్ అప్రమత్తం అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో గంటకు పైగా సముద్రంలోనే ఆ విమానం చక్కర్లు కొట్టింది. ముంబై నుండి న్యూయార్క్ వెళ్లాల్సిన AI191 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటు చేసుకోగా, వెంటనే పైలట్ అప్రమత్తం అయ్యారు. పైలట్ అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కొద్దిసేపటి వరకు విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. తరవాత చాకచక్యంగా ముంబైలో సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి వచ్చిన ప్రయాణికులకు హోటల్ లో వసతి కల్పించారు. మరోవైపు సాంకేతిక లోపం గుర్తించడంతో న్యూయార్క్ నుండి ముంబైకి షెడ్యూల్ చేయబడిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు AI191, AI144 రద్దు చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా సంస్థ.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతనే తమకు అత్యంత ప్రాధాన్యం అని ప్రకటించింది.






