BREAKING: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

by Ajay Maddhiboyina |

ఢిల్లీ శ్రీనగర్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో జమ్మూ ఎయిర్ పోర్ట్‌పై విమానం చక్కర్లు కొట్టింది. కానీ జమ్మూలో ల్యాండ్ అవ్వకుండానే ఢిల్లీకి వెనుదిరిగి వెళ్లిపోయింది.

BREAKING: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీ శ్రీనగర్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో జమ్మూ ఎయిర్ పోర్ట్‌పై విమానం చక్కర్లు కొట్టింది. కానీ జమ్మూలో ల్యాండ్ అవ్వకుండానే ఢిల్లీకి వెనుదిరిగి వెళ్లిపోయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జాగ్రత్తగా ఢిల్లీకి వెనుదిరిగినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్నామని, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశామని తెలిపింది.

ఇదిలా ఉంటే అహ్మదాబాద్ ఘటన తరవాత ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న దుబాయ్ నుండి జైపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉదయం బయలుదేరాల్సిన విమానం రద్దయ్యింది. రన్ వే పై విమానం ప్రారంభించినప్పుడు పైలట్ లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఆప్రాన్‌కు తీసుకువెళ్లాడు. నాలుగు గంటలు ఇంజనీర్లు శ్రమించినప్పటికీ సమస్య పరిష్కారం అవ్వకపోవడంతో విమానాన్ని రద్దు చేశారు.

Next Story