- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన భారీ ముప్పు
by Muthe.Rajitha |
ఎయిర్ ఇండియా(Air India) విమానాలకు సాంకేతిక సమస్యలు(Technical Issue) వెంటాడుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎయిర్ ఇండియా(Air India) విమానాలకు సాంకేతిక సమస్యలు(Technical Issue) వెంటాడుతున్నాయి. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం కారణంగా 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా నేడు అలాంటి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి కోల్కతా(Delhi -Kolkatha) వెళ్లాల్సిన AI2403 విమానానికి భారీ ప్రమాదం కొద్దిలో మిస్ అయింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా.. పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించారు. రన్ వే మీద 150కిమిల వేగంతో ఉన్న విమానాన్ని ఎమెర్జెన్సీ బ్రేకులు వేసి, వెంటనే నిలిపివేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం. కాగా సాంకేతిక లోపాన్ని నిపుణులు సరిదిద్దుతున్నారు.
Next Story






