- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India : మరో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
by Muthe.Rajitha |
మరో ఎయిర్ ఇండియా(Air India) విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మరో ఎయిర్ ఇండియా(Air India) విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) చేశారు. టోక్యో (హనేడా విమానాశ్రయం) నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, విమానంలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. విమానంలోని క్యాబిన్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి హాని జరగలేదని తెలిపిన ఎయిర్ ఇండియా.. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ తర్వాత ప్రయాణీకులను దించి, వారిని ఢిల్లీ పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత తరుచూ ఇలాంటి సమస్యలు తలెత్తడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Next Story






