మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీ- పారిస్ ఏఐ 143 విమానం సర్వీస్‌ రద్దు

by Ramesh Naini |   (  Updated:2025-06-17 13:11:59  IST  )

దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాల బయటపడుతున్నాయి.

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీ- పారిస్ ఏఐ 143 విమానం సర్వీస్‌ రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ (Air India flight) ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాల బయటపడుతున్నాయి. దీంతో పలు (flight cancelled) విమాన సర్వీసులను నిలిపివేశారు. తాజాగా (Delhi-Paris Air India flight) ఢిల్లీ- పారిస్‌ ఎయిరిండియా విమానం సర్వీసును రద్దు చేశారు. ముందస్తు తనిఖీల్లో ఏఐ 143 విమానంలో సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక బృందం ఈ విషయాన్ని పరిష్కరిస్తుంది. AI143 విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పారిస్‌కు మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరి రాత్రి 7:15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ముందస్తు తనిఖీల్లో విమానంలో సమస్యలు ఉన్నట్లు గుర్తించడంతో సర్వీస్‌ను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు రీఫండ్‌ చేస్తామని ఎయిరిండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

బాధిత ప్రయాణీకులకు హోటల్ వసతి, రీఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాల దృష్ట్యా ఇవాళ డీజీసీఏ కీలక సమావేశం నిర్వహించనున్నది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఎయిరిండియాలో వరుసగా సాంకేతిక సమస్యలు రావడంతో విమాన ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఎయిరిండియా బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం లండన్‌ వెళ్తుండగా అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఘటన దేశం మొత్తం ఉలిక్కిపడింది. తాజాగా అదే సంస్థకు చెందిన మరిన్ని విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడటంతో ప్రయాణికులను కలవరపెడుతోంది.

Next Story