- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maoists Party: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. మరో 11 మంది సరెండర్
ఆయుధాలతో సహా మరో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 2026 మార్చిలోపు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) ముగింపునకు సమయం దగ్గర పడుతున్నది. గత కొంత కాలంగా వరుస ఎన్‍కౌంటర్లు, అగ్రనేతల మృతి, మరి కొంత మంది సీనియర్ నేతల లొంగుబాట్లతో (Maoist surrenders) సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ తన అనుచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోగా.. తాజాగా మరో 11 మంది మావోయిస్టులు మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు. ఇవాళ గడ్చిరోలిలో(Gadchiroli police) ఆ రాష్ట్ర డీజీపీ రశ్మీ శుక్లా (Rashmi Shukla) ఎదుట సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఆయుధాలు అందజేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ లొంగిపోయిన వారిపై రూ. 82 లక్షల రివార్డు ఉందని, త్వరలోనే ఆ డబ్బులను వారికి అందజేస్తామన్నారు. ఇది గడ్చిరోలి పోలీసులు సాధించిన పెద్ద విజయం అని అన్నారు. గడ్చిరోలిలో నక్సలిజం అంతం ఆరంభం ఇదేనని అన్నారు. వచ్చే మార్చి 31 లోగా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర పోలీసులు పూర్తిగా కట్టుబడి ఉన్నారని శుక్లా స్పష్టం చేశారు.
లొంగిపోయింది వీళ్లే:
ఇవాళ లొంగిపోయిన వారిలో గడ్చిరోలికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు రమేష్ లేకామి (57), భీమా కోవాసి (35), ప్లాట్‌ఫామ్ పార్టీ కమిటీ సభ్యులు పోరియే గోటా(41), రతన్ ఓయం (32), కమల్ వెలాడి (30) ఉన్నారు, వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇక ఆయుధాలు వదులుకున్న వారిలో ఏరియా కమిటీ సభ్యులు పొరియే వెలాడి (36), రామాజీ పుంగటి (35), ప్లాటూన్ సభ్యులు సోను కటో (19), ప్రకాష్ పుంగటి (22), సీతా పల్లో (22), సాయినాథ్ మాడె (23) ఉన్నారని పోలీసులు తెలిపారు. 2022 నుండి గడ్చిరోలిలో మొత్తం 146 మంది మావోయిస్టులు లొంగిపోయారని, గడ్చిరోలి పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నిరంతర ఆపరేషన్ల కారణంగా జిల్లాలో ఈ ఏడాదిలో 112 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.






