- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల ప్రకటన.. రాష్ట్రానికి చెందిన ఎంపీలకు చోటు
లోక్‌సభ సెక్రటరీయేట్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ సెక్రటరీయేట్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీల్లో రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలను సభ్యులుగా నియమించింది. వారిలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ఎంపీలు ఉన్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రెండు కమిటీల్లో సభ్యుడిగా నియమించారు. జాన్ విశ్వాస్ బిల్లు, పరిశ్రమలపై వేర్వేరుగా ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో కొండా సభ్యులుగా ఉన్నారు. గోడెం నాగేష్ సోషల్ జస్టిస్ ఎంపవర్ మెంట్ కమిటీలో, అనిల్ కుమార్ యాదవ్ మందాడి కోల్ మైనింగ్ స్టీల్ కమిటీలో, ఈటల రాజేందర్ కెమికల్ ఫర్టిలేజర్ కమిటీలో, రవిచంద్ర వద్దిరాజు పెట్రోలియం నేచురల్ గ్యాస్ కమిటీలో, కె.లక్ష్మణ్, డీకే అరుణ, అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ కమిటీలో మెంబర్లుగా నియమించారు. దేవకొండ దామోదర్ రావు డిఫెన్స్ కమిటీలో, రామసహాయం రఘురామ రెడ్డి ఐటీ (ఎన్ఫర్మేషన్ టెక్నాలజీ) కమిటీలో, రఘునందన్ రావు పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సీ లా అండ్ జస్టిస్ కమిటీలో సభ్యులుగా నియమించారు. కడియం కావ్య హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో, అరవింద్ ధర్మపురి, మల్లు రవిని పరిశ్రమల కమిటీలో సభ్యులుగా నియమించారు.






