- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamilnadu: తమిళనాడులో లిక్కర్ స్కాం ప్రకంపనలు
తమిళనాడులో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TASMAC) మద్యం కుంభకోణం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TASMAC) మద్యం కుంభకోణం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కాగా.. లిక్కర్ స్కాంకి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాషాయపార్టీ నిరసనకు దిగింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్నారు. అయితే, అందుకు ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
నేతలు ఏమన్నారంటే?
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత సౌందరరాజన్ ను గృహ నిర్బంధం చేశారు. ఆమె మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారు. టెస్మాక్ లో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై(State BJP chief Annamalai) ఈ నిర్బంధాలను ఖండించారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. “డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వన్ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా అడ్డుకుంది . తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏమి చేయగలరు?” అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షం నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.






