- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Katchatheevu: మరోసారి తెరపైకి “కచ్చతీవు” అంశం.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం
లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడు(Tamil Nadu)లో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’(Katchatheevu) దీవుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడు(Tamil Nadu)లో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’(Katchatheevu) దీవుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చతీవు అంశంపై కాంగ్రెస్(Congress), బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతంది. కచ్చతీవుని శ్రీలంకకు అప్పగించడంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. అయితే, దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కె. అన్నామలై(Annamalai) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, దానిమిత్రపక్షం డీఎంకేల ఏకపక్ష, పేలవమైన ఆలోచన రహిత నిర్ణయాలని తప్పుబట్టారు. ఈ నిర్ణయం ద్వారా తమిళనాడు జాలర్ల జీవనోపాధిని ప్రమాదంలో పడేసిందని దుయ్యబట్టారు. ‘‘ కాంగ్రెస్, డీఎంకేల నిర్ణయం మన మత్స్యకారుల ప్రాణాలను బలిగొంది. నిరంతరం అరెస్టులు, మన ఫిషింగ్ బోట్లకు నష్టం కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారని సెల్వపెరుంతగై గ్రహించారా..?’’ అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కచ్చతీవు దీవుల విషయంలో కాంగ్రెస్ నాయకుడి వైఖరిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమర్థిస్తారా..? అని అడిగారు.
శ్రీలంకకు కచ్చతీవు అప్పగింత
మనదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ప్రధాని నరేంద్రమోడీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నామలై అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. 1974 ఇండో-శ్రీలంక సముద్ర ఒప్పందం ప్రకారం శ్రీలంకకు 285 ఎకరాల జనావాసాలు లేని ద్వీపమైన కచ్చతీవుని అప్పగించారు. ఇది వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది. ముఖ్యంగా తమిళనాడులో, ఈ చర్య తమిళ జాలరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బీజేపీ నిరంతరం విమర్శిస్తుంది. దీవిని శ్రీలంకకు అప్పగించడం ద్వారా మన వ్యూహాత్మక అవసరాలు దెబ్బతిన్నాయని రక్షణ రంగ నిపుణులు కూడా అంటున్నారు.






