- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Annamalai: తమిళనాడులో పొలిటికల్ హీట్.. అన్నామలై కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా వైఖరికి తాను కట్టుబడి ఉన్నానని అన్నామలై అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరికి తాను కట్టుబడి ఉన్నానని బీజేపీ తమిళనాడు మాజీ చీఫ్ అన్నామలై అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏకు నాయకత్వం వహిస్తు్న్న ఏఐఏడీఎంకేకు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుంటే అమిత్ షాతో చర్చించొచ్చని తెలిపారు. గురువారం ఆయన చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడారు. ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య సంబంధాలను పునరుద్ధరించడంలో జరుగుతున్న చర్చల్లో తన పాత్ర లేదని, కాబట్టి అమిత్ షా సూచన మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను ప్రశ్నిస్తే తాను పార్టీలో ఉండటానికి అర్హుడనని తెలిపారు.
ఏఐఏడీఎంకేకు ఎటువంటి అభిప్రాయాలున్నా వారు ఆయనతో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి రావొచ్చని తెలిపారు. నేను కూటమిలో ఘర్షణ కలిగించడానికి ప్రయత్నించడం లేదని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. తన నాయకుడి మాటలకు మాత్రమే మద్దతిస్తున్నానని తెలిపారు. ఎఐఏడీఎంకేతో జత కలవాలా వద్దా అనే నిర్ణయం పార్టీనే తీసుకుంటుందని నొక్కి చెప్పారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై ఎఐఏడీఎంకే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్నామలై వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.






