- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే పోరాటం.. వచ్చే నెల 30న నిరాహార దీక్ష ప్రకటన
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు రెడీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు (Anna Hazare hunger strike) సిద్ధమయ్యారు. ఈసారి బీజేపీ ప్రభుత్వంపై తన నిరసన అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. పెండింగ్‍లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని (Lokayukta) అమలు చేయడంలో మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు జనవరి 30న మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధితో నిరాహార దీక్షకు దిగబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇప్పుడు తాను చేపట్టబోయే నిరాహార దీక్షయే తన ఆఖరి నిరసన అవుతుందని 88 ఏళ్ల అన్న అజారే స్పష్టం చేశారు.
స్పందన రాకోపోవడంతోనే:
మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైందని చాలా కాలంగా అన్నా అజారే ఆరోపిస్తున్నారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2022లోనే రాలేగావ్ సిద్ధిలో హజారే నిరాహార దీక్షకు దిగారు. అయితే లోకాయుక్తను అమలు చేస్తామని నాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీతో నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి లోకాయుక్త చట్టం ముసాయిదాను రూపొందించారు. ఈ చట్టాన్ని మహారాష్ట్ర శాసనసభ ఉభయ సభలు ఆమోదించాయి. తరువాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే ఇంకా ఆ చట్టం క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అన్నా హజారే పేర్కొన్నారు. ఇదే విషయంలో తాను సీఎం ఫడ్నవీస్ కు ఏడు లేఖలు రాసినా స్పందన రాలేదని దీంతో ఇక తాను నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. కాగా గాంధేయ వాదిగా పేరుగాంచిన అన్న అజారే 2011లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా జన్ లోక్‌పాల్ బిల్లు చట్టాన్ని లోక్ పాల్ చట్టంగా తేవాలని పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే.






